హౌస్ లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు?
on Dec 4, 2022
బిగ్ బాస్-6 లో ఈ శనివారం జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున టిప్ టాప్ గా రెడీ అయ్యి వచ్చేసాడు. ఇక కంటెస్టెంట్స్ తో సరదగా మాట్లాడాడు. నాగార్జున మాట్లాడుతూ "బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్ అన్నింటిలోనూ ఎవరు బెస్ట్ కెప్టెన్, ఎవరు వరస్ట్ కెప్టెన్" అని కంటెస్టెంట్స్ ని అడిగాడు. దీంతో రేవంత్ "అబ్బ.. ఇంకా మొదలెట్టలేదే అనుకున్నా సర్" అడిగేసారు అంటూ సరదాగా మాట్లాడాడు. "సెవెన్ కెప్టెన్స్ లో ఎవరు బెస్ట్? ఎవరు వరస్ట్" అని రోహిత్ ని అడిగాడు నాగార్జున. "వరస్ట్ ఆదిరెడ్డి సర్. ఎందుకంటే కొన్ని పనులు చేస్తున్నప్పుడు స్ట్రిక్ట్ గా ఉండకుండా వదిలేసారు అని అనిపించింది. బెస్ట్ కెప్టెన్ కీర్తి భట్" అని చెప్పాడు. ఆ తర్వాత ఆదిరెడ్డిని బెస్ట్ ఎవరో అడుగగా "ఇనయా బెస్ట్ కెప్టెన్, వరస్ట్ కెప్టెన్ నేనే" అని తనను తానే అనుకున్నాడు. "నువ్వు కాకుండా ఎవరు" అని నాగార్జున అడుగగా "శ్రీసత్య వరస్ట్ కెప్టెన్" అని చెప్పాడు.
ఆ తర్వాత శ్రీసత్యని బెస్ట్, వరస్ట్ ఎవరో చెప్పమనగా.. "బెస్ట్ కెప్టెన్ ఇనయా, వరస్ట్ కెప్టెన్ ఆదిరెడ్డి. ఎందుకంటే తను కెప్టెన్ అయినా కూడా నార్మల్ గా ఉన్నాడు సర్" అని శ్రీసత్య చెప్పింది. దానికి రిప్లై ఇస్తూ, "ఏది చేసినా నాకు అంత పర్ఫెక్ట్ చేయాలనిపించదు సర్" అని ఆదిరెడ్డి చెప్పాడు.
ఆ తర్వాత ఇనయాని చెప్పమనగా, "బెస్ట్ కెప్టెన్ శ్రీసత్య.. ఎందుకంటే చాలా మంచిది. అన్ని పనుల్లో ఇన్వాల్వ్ అయింది. అహంకారం ఏం చూపించలేదు. ఇంకా వరస్ట్ కెప్టెన్ శ్రీహాన్.. ఎందుకంటే తను కెప్టెన్ అయ్యాక అధికారం చూపించినట్టు అనిపించింది. అది నాకు నచ్చలేదు" అని ఇనయా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత బెస్ట్, వరస్ట్ ఎవరూ అని శ్రీహాన్ ని అడుగగా "బెస్ట్ కెప్టెన్ ఇనయా చెప్పాడు. కెప్టెన్ అవ్వకముందు వేరేలా ఉండేది. అయ్యాక తనలో చాలా మార్పు వచ్చింది. తను నా మీద అధికారం చూపించలేదు. తన కెప్టెన్సీలో చాలా బాగా చేస్తుంది. ఆదిరెడ్డిని వరస్ట్ కెప్టెన్ గా అనుకుంటున్నాను. అందరిని ఫేవరేట్ గా చూసారు. అలా చూడకుండా ఉంటే బాగుండేది" అని శ్రీహాన్ అన్నాడు.
Also Read